Sun Dec 22 2024 22:08:34 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీకి టీడీపీ శాశ్వత శత్రువు కాదు
బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి టీడీపీ శాశ్వత శత్రువు కాదని ఆయన అన్నారు
బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి టీడీపీ శాశ్వత శత్రువు కాదని ఆయన అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఇందుకోసం అన్ని విధాలుగా ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై...
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. ఒక్క వినతిపత్రాన్ని ఇస్తే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని ఆయన అన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని టీజీ వెంకటేష్ అన్నారు.
- Tags
- tg venkatesh
- tdp
Next Story