Thu Mar 27 2025 02:59:49 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : ఇప్పుడు చెబుతున్నా.. అందుకేపార్టీని వీడాల్సి వచ్చింది
జగన్ కాదు విశ్వసనీయత కోల్పోయింది తాను కాదని, జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు

జగన్ కాదు విశ్వసనీయత కోల్పోయింది తాను కాదని, జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. తాను భయపడలేదని, ప్రలోభాలకు లొంగింది లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సీఐడీ కార్యాలయానికి విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ కు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆత్మగౌరవం ఉన్న వాడు ఎవరూ ఆ పార్టీలో ఉండరని తెలిపారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, దానివల్లనే తాను దూరమయ్యాయని విజయసాయిరెడ్డి తెలిపారు.
తనకు స్థానం లేదని తెలిశాక...
జగన్ మనసులో తనకు స్థానంలేదని తెలిసిన తర్వాత తనమనసు విరిగిపోయిందన్నారు. అందుకే తాను పార్టీని వీడినట్లుచెప్పారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్ ఉంటుందని, జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని విజయసాయిరెడ్డి తెలిపారు. లీడర్ అనే వాడు చెప్పుడు మాటలు విని అవమానించకూడదని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story