Mon Dec 23 2024 12:57:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ అత్యున్నతస్థాయి సమావేశం
కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది. ఈరోజు, రేపో దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుదలకానుంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది. ఈరోజు, రేపో దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే అభ్యంతరాలను ఇప్పటికే పరిశీలంచిన ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 వేల అభ్యంతరాలు ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా బాలాజీ జిల్లా పేరును మార్చాలని, బాలాజీ అనే పదం నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి,
సానుకూలంగానే....
దీనికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని సమాచారం. తిరుపతి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జగన్ స్వయంగా కొన్ని అభ్యంతరాలను పరిశీలించి అధికారులను ఆదేశించే అవకాశముందని తెలిసింది. కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా మరో నాలుగు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్ సమీక్ష తర్వాత కొత్త జిల్లాలపై స్పష్టత రానుంది. ఈరోజు కాని రేపు కాని తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
Next Story