Fri Nov 29 2024 22:00:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో "ఫ్యామిలీ డాక్టర్" 15 నుంచి
ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రారంభం కానుంది. దీనిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాటి నుంచి దీనిని ప్రారంభించనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ప్రతి నెల రెండుసార్లు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది. 104 వాహనాలను సందర్శించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామీణుల చెంతకు మెరుగైన సేవలు అందించేందుకే ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని జగన్ ప్రభుత్వం తేనుంది.
ట్రయల్ రన్...
ఒక వైద్యుడు పీహెచ్సీలో విధులు నిర్వహిస్తుంటే మరో డాక్టర్ 104 వాహనాలతో గ్రామీణ ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ పథకంపై ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థిితిని ఫ్యామిలీ డాక్టర్ రికార్డు చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, బాలింతల ఆరోగ్యపరిస్థితిని వైద్యుడు తెలుసుకుని తగిన సూచనలు ఇస్తారు. అవసరమైన మందులను పంపిణీ చేస్తారు. ఇందుకు కొత్తగా 432 వాహనాలు అవసరమవుతాయిని వైద్య శాఖ అంచనా వేసింది. అందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
Next Story