Mon Dec 23 2024 20:31:59 GMT+0000 (Coordinated Universal Time)
సాయితేజ భౌతిక కాయం కోసం ఎదురు చూపులు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆర్మీ అధికారుల నుంచి వారికి ఎలాంటి సమాచారం అందలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయం గుర్తు పట్టని విధంగా ఉంది. అందుకోసం డీఎన్ఏ టెస్ట్ లు చేయాల్సి ఉంది. ఇప్పటికే సాయితేజ కుటుంబ సభ్యుల రక్తనమూనాలను సేకరించి డీఎన్ఏ టెస్ట్ ల కోసం పంపారు.
ఫొటోలను చూసి...
ఆ నివేదికలు వచ్చిన తర్వాతనే సాయితేజ భౌతిక కాయం ఎప్పుుడ వస్తుందనేది తెలుస్తుంది. భౌతిక కాయంపై ఉన్న గుర్తులను గుర్తు పట్టేందుకు కుటుంబ సభ్యులను ఢిల్లీకి రావాల్సిందిగా ఆర్మీ అధికారులు కోరారు. శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా సాయితేజ భౌతిక కాయాన్ని గుర్తు పట్టాల్సి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు తాము ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి రాలేమని చెప్పడంతో భౌతిక కాయానికి సంబంధించిన ఫొటోలను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story