Sun Dec 22 2024 17:25:08 GMT+0000 (Coordinated Universal Time)
ఐదు కిలోల బరువు తగ్గిన చంద్రబాబు.. ఇంకా తగ్గితే...?
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇప్పటికే చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారు
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇప్పటికే చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే దాని ప్రభావం కిడ్నీలపై పడుతుందని భువనేశ్వరి ఆందోళన చెందారు. జైలులో ఉన్న అపరిశుభ్రత కారణంగానే చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అత్యవసర వైద్యం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు ఆరోగ్యానికి ఏమైతే అందుకు జైలు అధికారులే బాధ్యత వహించాలని కోరారు.
కుటుంబ సభ్యుల ఆందోళన...
చంద్రబాబు స్కిల్ డెవలెెప్మెంట్ స్కాం కేసులో 33 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఎండవేడిమి, ఉక్కపోతతో చర్మసంబంధిత వ్యాధులు సోకడంతో వైద్యులు ఆయనకు పరీక్షలు జరిపారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, భోజనంలో కొన్ని మార్పులు చేస్తే మంచిదని సూచించారు. కానీ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.
అదేమీ లేదు...
మరోవైపు కోస్తాంధ్ర జైళ్ల శాఖ రవికిరణ్ మాత్రం దీనిని ఖండించారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. భయపడాల్సిన పనిలేదనిచెప్పారు. చంద్రబాబు ప్రస్తుతం డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని, అందుకు వైద్యుల సలహాలు తీసుకుని తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
Next Story