Mon Dec 23 2024 08:47:41 GMT+0000 (Coordinated Universal Time)
బాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. వారానికి రెండుసార్లు ములాఖత్ సౌకర్యం ఉండటంతో కొద్దిసేపటి క్రితం వీరంతా చంద్రాబాబుతో ములాఖత్ అయ్యారు.
నారాయణ కూడా...
పార్టీ పరిస్థితులతో పాటు బయట జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబుతో చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీ నేతలు, శ్రేణులు చేస్తున్న ఆందోళన విషయం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు దాదాపు ఇరవై రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై కూడా నారాయణ, చంద్రబాబు చర్చించే అవకాశముంది.
Next Story