Mon Dec 23 2024 12:25:48 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం.. అడ్డుకున్న రైతులు, ప్రజలు!
మంత్రి పలాసకు వెళ్తుండగా.. కంబిరిగాం సమీపంలో మంత్రి అప్పలరాజు కాన్వాయ్ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. పట్టాలు..
పలాస : ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. పలాస మండలం కంబిరిగాం గ్రామానికి చెందిన రైతులు, మహిళలు మంత్రిని అడ్డుకున్నారు. ఓట్లెసి గెలిపించిన మాకు అన్యాయం చేస్తారా ? అంటూ ఓ మహిళ మంత్రి కారుకు అడ్డంగా నిల్చుని ప్రశ్నించడంతో.. షాకవ్వడం మంత్రి వంతైంది. సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి పలాసకు వెళ్తుండగా.. కంబిరిగాం సమీపంలో మంత్రి అప్పలరాజు కాన్వాయ్ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన మీరు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నించారు. రైతులు, మహిళల ప్రశ్నలతో షాకైన మంత్రి.. కొద్దిసేపటికి తేరుకుని వారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారందరినీ పక్కకు తోసేసి.. మంత్రి కాన్వాయ్ ను పంపించేశారు.
Next Story