Mon Jan 06 2025 09:25:32 GMT+0000 (Coordinated Universal Time)
11వ రోజుకు చేరిన రైతుల పాదయాత్ర
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్ర నేటికి 11వ రోజుకు చేరుకుంది.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్ర నేటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ మహాపాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. గ్రామాల మీదుగా సాగుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. కృష్ణా జిల్లా కావడం, రాజధాని అమరావతికి దగ్గరగా ఉండటంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు.
పండగలు కూడా...
వీరితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. భారతీయ జెండాలతో రైతుల యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 12వ తేదీన అమరావతి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ కొనసాగనుంది. మొత్తం రెండు నెలల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. దసరా, దీపావళి పండగలు కూడా రైతులు యాత్రలోనే జరుపుకోవాలని నిర్ణయించారు.
Next Story