Tue Nov 19 2024 09:47:08 GMT+0000 (Coordinated Universal Time)
విదేశాల నుంచి ఏపీకి 20 మంది... అందరూ గాయబ్
ఏపీ లో ఒమిక్రాన్ వేరియంట్ భయం మొదలయింది. విదేశాల నుంచి వచ్చిన 20 మంది కన్పించకుండా పోవడం అధికారుల్లో ఆందోళన కలుగుతుంది
ఆంధ్రప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ భయం మొదలయింది. విదేశాల నుంచి వచ్చిన ఇరవై మంది కన్పించకుండా పోవడంతో అధికారులు సయితం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారి ఆచూకీ లభించలేదు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని, లేకుంటే ఇబ్బంది పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎయిర్ పోర్టుల్లో....
అలాగే విశాఖలోనూ ఒమిక్రాన్ వేరియంట్ పై ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. పన్నెండు దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టాలని ఆదేశించింది. ఎయిర్ పోర్టులో 24 గంటలు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సౌతాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 20 మంది జాడ తెలియకపోవడంతో అధికారులు కంగారు పడుతున్నారు.
Next Story