Mon Dec 23 2024 02:00:11 GMT+0000 (Coordinated Universal Time)
5 రోజులపాటు విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
తెనాలి-గుంటూరు (07282), గుంటూరు-విజయవాడ (07864), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465)..
నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లైన్లలో నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. రద్దైన రైళ్ల వివరాలిలా ఉన్నాయి. కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267/17268), కాకినాడ-విజయవాడ (17257/17258), విజయవాడ-గుంటూరు (07783), గుంటూరు-తెనాలి (07887), విజయవాడ-గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873) రైళ్లు రద్దయ్యాయి.
తెనాలి-గుంటూరు (07282), గుంటూరు-విజయవాడ (07864), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465), తెనాలి-రేపల్లె (07888), రేపల్లె-మార్కాపురం (07889), మార్కాపురం-తెనాలి (07890), తెనాలి-విజయవాడ(07630) రైళ్లు రద్దయ్యాయి. 5 రోజుల వరకూ ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. అలాగే.. గుంటూరు-మాచర్ల (07779/07780) మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి, విజయవాడ-మాచర్ల (07781/07782) రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య రైళ్లను రద్దు చేశారు.
Next Story