Mon Dec 23 2024 13:48:33 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణాజిల్లాలో థియేటర్ల తనిఖీలు.. 15 థియేటర్లు సీజ్
కృష్ణాజిల్లా విజయవాడలో జేసీ మాధవీలత ఆధ్వర్యంలో థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. నగరంలోని గాంధీనగర్ లో జయరాం థియేటర్ కు వచ్చిన ఆమె.. సినిమా టికెట్ల
ఏపీలోని వివిధ జిల్లాలో థియేటర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లోని వివిధ థియేటర్లలో తనిఖీలు చేసిన అధికారులు.. అధిక రేట్లకు టికెట్లు విక్రయం, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు సరిగ్గా లేని థియేటర్లను సీజ్ చేశారు. తాజాగా కృష్ణాజిల్లా విజయవాడలో జేసీ మాధవీలత ఆధ్వర్యంలో థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. నగరంలోని గాంధీనగర్ లో జయరాం థియేటర్ కు వచ్చిన ఆమె.. సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలోని ఫైర్ సేఫ్టీ సదుపాయాలను తనిఖీ చేశారు. అలాగే ప్రేక్షకుల రద్దీ ఉన్నప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నారా ? లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాధవీలత మీడియాతో మాట్లాడుతూ..కృష్ణాజిల్లా వ్యాప్తంగా 15 థియేటర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
తినుబండారాల రేట్లను నియంత్రిస్తాం
ప్రతిఒక్క థియేటర్ నూ తనిఖీ చేస్తున్నామని చెప్పిన ఆమె.. టికెట్ ధరలు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రోటోకాల్స్ విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని థియేటర్లలో టికెట్ల రేట్ల కంటే.. తినుబండారాల రేట్లు విపరీతంగా పెంచేశారన్నారు. త్వరలోనే వాటి రేట్లను కూడా నియంత్రించే చర్యలు చేపడుతామన్నారు. మల్టీఫ్లెక్స్లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ రేట్లు నిర్ణయించి బోర్డులు పెడతామని మాధవీలత పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లపై ఇచ్చిన జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్ల అమలుపై దృష్టి పెట్టామన్నారు. పెద్ద సినిమాల సమయంలో టికెట్ రేట్లను పెంచుకోవాలంటే.. మాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Next Story