Mon Dec 23 2024 07:48:52 GMT+0000 (Coordinated Universal Time)
Sri Reddy : చెల్లివి కాదు.. శూర్పణఖవి.. షర్మిలపై హాట్ కామెంట్స్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై సినీ నటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో శ్రీరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అయింది
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై సినీ నటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకలను పంపడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో శ్రీరెడ్డి వైఎస్ షర్మిలను ఉద్దేశించిన ట్వీట్ వైరల్ గా మారింది. చెల్లివి కాదు సూర్పనఖ వంటూ హాట్ కామెంట్స్ చేశారు. శ్రీరెడ్డి వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలిగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు.
దేవుడిని అడ్డం పెట్టుకుని...
"నీకు ఆస్తి కన్నా ఆంధ్ర ప్రజలు భవిష్యత్ ముఖ్యం కాదు ,నువ్వు చెల్లివి కాదు రాకాసి సూర్పనఖవి ,..దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము ని చందాల రూపంలో అడుక్కుని తినే బతుకులు మీవి..విదేశీ ఫండ్స్ దోచుకుతినే మీరు కూడా, జగన్ అన్నకి గోతులు తీసినంత మాత్రాన లేదా శాపాలు పెట్టినంత మాత్రాన అవన్నీ తిరిగి మిమ్మల్నే సైతాన్లగా పీడిస్తాయి..పతివ్రత కట్టింగ్స్ వద్దులే..జాగ్రత్త అతి చేష్టలు వంటికి మంచిది కాదు" అంటూ ట్వీట్ చేసింది.
Next Story