Sat Dec 21 2024 17:15:12 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ మార్చి మూడో వారంలో విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ మార్చి మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మార్చి 18వ తేదీ నాటికి జిల్లాల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ప్రారంభించారు.
కొత్త జిల్లాల్లో....
ఆంధ్రప్రదేశ్ లో పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి కూడా గడువు ఇచ్చారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుతో పాటు, అధికారుల కేటాయింపు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
Next Story