Fri Nov 22 2024 03:13:01 GMT+0000 (Coordinated Universal Time)
జీతాలు పడ్డాయంట.. పే స్లిప్ చూసుకోండి
ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను చెల్లించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపు జరిగింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను చెల్లించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపు జరిగినట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా కొత్త పీఈర్సీ ప్రకారమే జనవరి నెల జీతాల చెల్లింపులు జరిపినట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. తమ పే స్లిప్ లను పేరోల్ డాట్ హెర్బ్ డాట్ ఏపీ సీఎఫ్ ఎస్సెస్ వైబ్ సైట్ నుంచి డౌన్ లోడు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి ఉద్యోగికి మొబైల్ ఫోన్ లో జీతాలకు సంబంధించిన సమాచారాన్ని పంపినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
పాత జీతాలు కావాలంటూ....
తమకు పాత జీతాలు కావాలని, కొత్త జీతాలు వద్దంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోను కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు 12 గంటలకు చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించడమేంటని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకుంటామని అంటున్నారు.
Next Story