Wed Mar 26 2025 03:36:49 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపుపై పయ్యావుల ఆగ్రహం
రుషికొండ భవన నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల అధికారులపై సీరియస్ అయ్యారు

రుషికొండ భవన నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల అధికారులపై సీరియస్ అయ్యారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు.
నిర్మాణ పనులను...
రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారుల వెల్లడించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు అధికారులు వివరించారు. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఓసారి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ మంత్రి పయ్యావుల అధికారులపై అసహనం వ్యక్తం చేశారరు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని మంత్రి పయ్యావుల అధికారులను ఆదేశించారు.
Next Story