Fri Nov 22 2024 12:24:20 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ముదివీడు పోలీసు స్టేషన్
పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ముదివీడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఏ1గా చంద్రాబాబు. ఏ2గా దేవినేని ఉమ ను, ఏ3గా అమర్నాథ్ లను చేర్చారు.. మిగిలిన అన్ని కేసుల్లోనూ ఏ1గా చల్లాబాబును చేర్చారు. దీంతో పాటు మరో 2 కేసులు కూడా నమోదయ్యాయి.
ఇటీవల పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగిన అల్లర్లలో 50మంది పోలీసులు గాయపడ్డారు. డాక్టర్ ఉమాపతి రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నేరం చేయడానికి ప్రేరేపించడం, హాని చేయడం కోసం, హత్యాప్రయత్నం కోసమే రెచ్చగొట్టారని తెలిపారు. అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే రెచ్చగొట్టారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కుట్రపూరితంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అల్లర్లకు సంబంధించిన డిటైల్డ్ ఫుటేజ్ నుకూడా ఉమాపతిరెడ్డి పోలీసులకు ఇచ్చారు.
పుంగనూరు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కారు.
Next Story