Mon Dec 23 2024 13:43:02 GMT+0000 (Coordinated Universal Time)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్ 2 లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్ 2 లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ల్యాడిల్ కు రంధ్రం పడి ఉక్కుద్రవం నేలపాలవ్వడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంలో రెండు లారీలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
రూ. 50 లక్షలు ఆస్తినష్టం
సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. ఇదిలా ఉండగా.. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా.. గతంలో పలుమార్లు స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదాలు జరిగాయి.
Next Story