Mon Dec 23 2024 06:03:22 GMT+0000 (Coordinated Universal Time)
కోనసీమలో తొలి ఒమిక్రాన్ కేసు
కోనసీమలో మొదట ఒమిక్రాన్ కేసు నమోదయింది. అయినవిల్లి మండలం నేదునూరి సావం గ్రామంలో ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది
ఆంధ్రప్రదేశ్ కోనసీమలో మొదట ఒమిక్రాన్ కేసు నమోదయింది. అయినవిల్లి మండలం నేదునూరి సావం గ్రామంలో ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నెల 19వ తేదీన కువైట్ నుంచి విజయవాడ మీదుగా కారులో వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
రెండు వ్యాక్సిన్ లు వేసుకుని...
గన్నవరం ఎయిర్పోర్టులో సాధారణ కరోనా శాంపిల్ ను సేకరించి పరీక్షలకు పంపారు. అయితే ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోనసీమ వైద్యులకు సమాచారం అందించారు. రెండు వ్యాక్సిన్ లు వేయించుకుని కువైట్ నుంచి బయలుదేరి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకడంతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ రావడంతో కోనసీమ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story