Mon Dec 23 2024 06:08:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్
తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తొలిరోజే టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు
తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తొలిరోజే టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ లను సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీ చేశారు. సభ జరిగినన్ని రోజులు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ లను స్పీకర్ పదే పదే హెచ్చరించారు. కానీ వారు వినకపోవడంతో ముగ్గురిని శాసనసభ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారు.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్...
దీంతో మొత్తం టీడీపీకి చెందిన పదిహేను మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన పదమూడు మందిని మాత్రం ఈరోజు ఒక్కరోజు మాత్రమే సస్పెండ్ చేశారు. బాలకృష్ణ సభలో మీసం మెలేయడం సరికాదని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఇది తొలి తప్పిదంగా భావించి వదిలేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సభ సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. మరోసారి ఇలాంటివి చేస్తే ఊరుకోబోమని స్పీకర్ హెచ్చరికలు జారీ చేశారు.
Next Story