Fri Nov 22 2024 23:06:56 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
రాజవొమ్మంగి మండలం లొదొడ్డిలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు కల్లు
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లొదొడ్డిలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు కల్లు తాగేందుకు వెళ్లారు. ఐదుగురూ కలిసి కల్లు తాగారు. తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. దాంతో స్థానికులు బాధితులను సమీపంలోని ఏలేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read : కచ్చా బాదం సింగర్ ఎవరు ? కచ్చా బాదం అంటే ఏంటి ?
అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందగా.. మిగతా ముగ్గురినీ కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. వారు కూడా మృతి చెందడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానిక అధికారులు సదరు కల్లు దుకాణానికి చేరుకుని, అక్కడ కల్లు శాంపిల్స్ ను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవు, ఏసుబాబు గా గుర్తించారు. ఒకేసారి ఐదుకుటుంబాలకు చెందిన వ్యక్తులు కల్తీ కల్లు సేవించి చనిపోవడంతో లొదొడ్డి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story