Mon Dec 23 2024 07:45:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ పెళ్లి.. వరకట్న వేధింపులు భరించలేక గర్భిణీ ఆత్మహత్య
ఐదు నెలల గర్భిణీ అయిన కుసుమ లక్ష్మి వేధింపులు భరించలేక.. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన..
ప్రేమపెళ్లి చేసుకున్న ఓ మహిళ.. అత్తింటి వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని పెడనలో జరగింది. ఐదు నెలల గర్భిణీ అయిన కుసుమ లక్ష్మి వేధింపులు భరించలేక.. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుసుమలక్ష్మి అనే మహిళ తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్లకే ఆమె గర్భం దాల్చింది.
Also Read : 8ఏళ్ల బాలికపై వృద్ధుడి లైంగిక దాడి
మృతురాలు ప్రస్తుతం ఐదునెలల గర్భిణి. కొన్ని వారాలుగా కుసుమ - ఆమె భర్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని వేధిస్తుండటంతో.. తల్లికి ఫోన్ చేసి తనగోడు చెప్పుకుని ఏడ్చింది. వరకట్న వేధింపులు తాళలేక గర్భిణిగా ఉన్న కుసుమ.. ఇంట్లోనే ఉరివేసుకుంది. కూతురిని చూసేందుకు ఇంటికి వెళ్లిన తల్లికి.. కుసుమ విగతజీవిగా కనిపించడంతో.. ఆమె గుండెలవిసేలా రోధించింది. గుడ్లవల్లేరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story