Sat Apr 12 2025 22:48:00 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలానికి పెరుగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. పది గేట్లను అధికారులు ఎత్తారు.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. పది గేట్లను అధికారులు ఎత్తారు. పదిహేను అడుగుల మేర గేట్లను ఎత్తి దిగువకు నీటని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 3,56,442 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 4,40,991 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.60 అడుగుల మేర నీటి మట్టం ఉంది. .
పూర్తి స్థాయి నీటి నిల్వ...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మరింత వరద నీరు చేరే అవకాశముంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 214.3637 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలంలో కుడి, ఎడమల జల విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story