Thu Nov 21 2024 15:34:16 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కరుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కరుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధఇకారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం రెండు గేట్లను పది మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యుత్తు ఉత్పత్తి...
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,17,326 క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో 1,22,874 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. ఒక అడుగు మాత్రమే ఉంచి మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సందడి మొదలయింది. అయితే అక్కడ పర్యాటకులు ఎలాంటి ఫొటోలు తీసుకుని ప్రమాదాల బారిన పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story