Mon Dec 23 2024 01:55:38 GMT+0000 (Coordinated Universal Time)
నిండుకుండలా శ్రీశైలం జలాశయం
శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 882.50 అడుగులుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 882.50 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో నేడు గేట్లను తెరవనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. గేట్లను ఎత్తడానికి అంబటి రాంబాబు నిన్ననే శ్రీశైలం చేరుకున్నారు. నీటి నిల్వ 215 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం ప్రాజెక్టులలో 202 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం 57,751 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు.
విద్యుత్తు ఉత్పత్తి....
మరోవైపు ఎడమ, కుడి కాల్వ గట్టులో విద్యత్ ఉత్పత్తి ప్రారంభమయింది. విద్యుత్ ఉత్పత్తికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఇవ్వడంతో 765 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడూ ఆగస్టు నెలలో విద్యుత్ ఉత్పత్తికి బోర్డు అనుమతించేది. కానీ ఈసారి జులై నెలలో వర్షాలు కురియడంతో ముందుగానే విద్యుత్తు ఉత్పత్తికి అనుమతిని మంజూరు చేసింది.
Next Story