Mon Dec 23 2024 18:43:53 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో ఫుట్ బాల్ ప్లేయర్ దారుణ హత్య
ఆకాష్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు టోర్నీల్లో కప్‌లు కూడా సాధించాడు.
విజయవాడలోని గురునానక్ కాలనీలో యువకుల మధ్య గొడవ ఏకంగా ప్రాణం తీసే వరకూ వెళ్ళింది. జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ ఆకాష్‌ను దారుణంగా హత్య చేశారు. ఆకాష్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు టోర్నీల్లో కప్‌లు కూడా సాధించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో రౌడీషీటర్ టోని అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోని అంత్యక్రియల సమయంలో ఆకాష్, ప్రభాకర్ గ్యాంగ్‌ల మధ్య వివాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల తర్వాత వీరంతా ఓ బార్లో మద్యం సేవించారు. ఈ క్రమంలోనే టోని గ్యాంగ్‌లోని ప్రభాకర్ బ్యాచ్, ఆకాష్ గ్యాంగ్ మధ్య వివాదం చెలరేగింది. గొడవ పెద్దది అయినప్పుడు పోలీసులు వస్తున్నారని తెలియడంతో రెండు గ్యాంగులు బార్ నుంచి పరారయ్యారు.
దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ గ్యాంగ్ మంగళవారం రాత్రి ఆకాష్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అతడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కత్తులతో దాడి చేయడం.. కత్తి గొంతులోకి బలంగా దిగడంతో ఆకాష్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆకాష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టోని గ్యాంగ్ ను పట్టుకునే పనిలో పడ్డారు. టోని అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై దృష్టిసారించారు. ఆకాష్ మృతి కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story