Thu Dec 19 2024 15:04:37 GMT+0000 (Coordinated Universal Time)
ముస్తాఫా.. వ్యాపారాలపై ఐటీ ఫోకస్
గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా బంధువుల ఇళ్లలో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు
గుంటూరులో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కుటుంబ సభ్యుల ఇళ్లలో నిన్నటి నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముస్తాఫా సోదరుడు కనుమ నివాసంలో నిన్నటి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
రెండోరోజు సోదాలు...
పలు వ్యాపార లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ముస్తాఫా సోదరుడికి పొగాకు వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు ఉండటంతో పన్ను ఎగవేతపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాపార లావాదేవీలను ఆయన సోదరుడు కనుమ చూస్తుండటంతో ఆయన ఇంటిపైనే ఐటీ శాఖ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
Next Story