Fri Dec 20 2024 17:52:14 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల నడక మార్గాల్లో ఇనుప కంచె ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదన
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చిరుత భయాందోళన పెరిగిపోతోంది. తాజాగా మరో చిరుత అటవీ శాఖ అధికారుల బోనులోకి చిక్కింది..
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చిరుత భయాందోళన పెరిగిపోతోంది. తాజాగా మరో చిరుత అటవీ శాఖ అధికారుల బోనులోకి చిక్కింది. ఇప్పటి వరకు మొత్తం ఐదు చిరుతలు చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే భద్రత నేపథ్యంలో భక్తులకు టీటీడీ అధికారులు కర్రలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల నడక మార్గంలో కంచె ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించారు. దీంతో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా డిజైన్ల మేరకు నిర్మాణానికి టీటీడీ సిద్ధం చేస్తోంది.తిరుమల నడకమార్గాల్లో చిరుతల సంచారం తో భక్తుల్లో భయాన్ని పోగొట్టేందుకు టీటీడీ శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతూనే ఉంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ఇనుపకంచెల నిర్మాణాలకు టిటిడి ప్రతిపాదనలను సిద్దం చేసింది.
అయితే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న నడకమార్గాల్లో ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టం చేసింది.ఈ కంచెను డిజైన్లతో ఏర్పాటు చేసేందుకు టీటీడీ సిద్దమవుతోంది. ఆగస్టు 11న లక్షితపై చిరుత దాడి చేసి చంపడంతో భక్తుల్లో భయం మరింతగా పెరిగింది. దీంతో అప్పటి నంచి టీటీడీ, అటవీశాఖ చర్యలు ముమ్మరం చేసి ఇప్పటి వరకు నాలుగు చిరుతలు బోనుకు చిక్కగా, తాజాగా మరో చిరుత చిక్కింది. దీంతో బోనుకు చిక్కిన చిరుతల సంఖ్య 5కు చేరింది. రెండు నరకమార్గాల్లో 500 ట్రాప్ కెమెరాలతో అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. చిరుతల కదలికపై ఎప్పుటికప్పుడు నిఘా పెడుతున్నారు. చిరుత భయాందోళన నేపథ్యంలో నడక మార్గంలో పలు ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఇందులో భాగంగానే సెక్యూరిటీని పెంచడం, భక్తులకు చేతి కర్రలు ఇచ్చి పంపడం చేస్తున్న టిటిడి నడకమార్గాల్లో ఇనుపకంచె నిర్మాణాల కోసం ప్రతిపాదనను కేంద్రానికి పంపింది.
7.2 కిలోమీటర్ల దూరం 3550 మెట్లు ఉన్న అలిపిరి నడక మార్గం, మరోవైపు 2.1 కిలో మీటర్ దూరంలో 2650 మెట్లు ఉన్న శ్రీవారి మెట్టుమార్గం ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువైపోతుండటంతో కంచె ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తోంది టీటీడీ.ఎస్ వి అభయారణ్యంలో టిటిడి ఫారెస్ట్ పరిధి కేవలం 8 వేల ఎకరాల లోపే ఉండగా అందులోనే రెండు నడకమార్గాలు ఉన్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న క్రూర మృగాలు సంచరించే సమయంలో మధ్యలో ఉన్న నడకమార్గాలను క్రాస్ చేయడం ఎప్పటినుంచో జరుగుతూ ఉందన్నది అటవీ శాఖ వాదన. ఈ నేపథ్యంలో నడకమార్గాలకు ఇరువైపులా కంచె నిర్మాణం చేపట్టడం అటవీ శాఖ చట్టాలకు విరుద్ధమైన వాదన ఎప్పటినుంచో ఉండగా, ఇప్పుడు మనుషులపై వరుసదాడులతో మరోసారి కంచె నిర్మాణం చర్చకు వచ్చింది. ఈ ఇరుప కంచ వేయడానికి కేంద్ర అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు ప్రతిపాదనలను పంపింది. తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే నడకమార్గాల్లో ఇరువైపులా కంచి నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.
Next Story