Thu Apr 17 2025 00:48:00 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సాకే శైలజానాధ్ వైసీపీలోనే ఎందుకు చేరారో తెలిస్తే విస్తుపోవాల్సిందే.. పదేళ్ల తర్వాత?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వైసీలో చేరారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వైసీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సాకే శైలజానాధ్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఆయన వైసీపీలో చేరడానికి ప్రధాన కారణాలు తెలిస్తే అందరూ విస్తుపోవాల్సిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. శాసనసభ ఎన్నికలు జరిగి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది. ఇప్పుడే పార్టీలో చేరడానికి కారణాలేంటి? ఇంకా కొన్నిరోజులు ఆగి చేరవచ్చు కదా? లేకుంటే టీడీపీ లేదా జనసేనలోనైనా చేరవచ్చు. కానీ వైసీపీని మాత్రమే ఎంచుకోవడంలో ఆయనకు ప్రత్యేక కారణముందని చెబుతున్నారు.
ఆఫర్లు 2014లో వచ్చినా...
సాకే శైలజానాధ్ మాజీ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. దళిత వర్గానికి చెందిన శైలజానాధ్ కు సౌమ్యుడిగా పేరుంది. ఆయన వివాదాల జోలికి పోరు. పార్టీని నమ్ముకుని ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతమని సన్నిహితులు చెబుతుంటారు. 2014లో నే శైలజానాధ్ కు టీడీపీ, వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయన కాంగ్రెస్ ను వదలి వెళ్లలేదు. అందుకు కారణం కాంగ్రెస్ తనకు పదవులు ఇవ్వడమే కాకుండా మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందన్న ఏకైక కారణం. శైలజానాధ్ కు తాడిపత్రి మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. అయినా సరే సాకే శైలజానాధ్ టీడీపీని కాకుండా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అన్ని పార్టీలూ పిలుస్తున్నా...
సాకే శైలజానాధ్ ను ఏ పార్టీ అయినా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అందుకు కారణం అతని లో ఉన్న క్రెడిబులిటీ మాత్రమే. అయితే వైసీపీలో చేరడానికి ప్రధాన కారణాలు శింగనమల నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులేనని చెప్పాలి. 2004, 2009 లో సాకే శైలజానాధ్ శింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టుడిగా పేరు పొందారు. ఎలాంటి అవినీతి మచ్చ లేని ఆయనను వైఎస్ కూడా ప్రోత్సహించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచిపోటీ చేసినా మూడు సార్లు ఆయన విజయంసాధించలేకపోయారు. శైలజానాధ్ కు మంచి పేరున్నా కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేకపోవడంతోనే ఆయన గెలుపొంద లేదు.
బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో...
వైసీపీ నుంచి గత ఎన్నికల్లో శింగనమల నుంచి పోటీచేసిన వీరాంజనేయులు యాక్టివ్ గా లేరు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థికి 94 వేల ఓట్లు వచ్చాయి. స్ట్రాంగ్ గా వైసీపీ ఓటు బ్యాంకు ఉండటంతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడయితే సులువుగా విజయం సాధించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవు. కాంగ్రెస్ లో ఉండి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం ఇష్టలేక తన సన్నిహితుల కోరిక మేరకే ఆయన వైసీపీని ఎంచుకున్నారు. ఎస్సీరిజర్వడ్ నియోజకవర్గం కావడంతో దళితులు, ముస్లింలతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా తన గెలుపునకు దోహదపడతాయని ఆయన అంచనా వేసి ఫ్యాన్ పార్టీ కింద చేరారు.
Next Story