Tue Apr 08 2025 20:01:49 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నందిగం సురేష్ కు బెయిల్ మంజూరు
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ లభించింది

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఆయన గత కొద్ది రోజులుగా జైలులో ఉన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన చాలా రోజుల నుంచి రిమాండ్ లో ఉన్నారు. ఈరోజు హైకోర్టులో ఆయన బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది.
షరతులతో కూడిన...
అయితే నందిగం సురేష్ కు ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఈరోజు నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనేక మంది పై కేసులు నమోదయ్యాయి. అయితే సీసీ టీవీ కెమెరాల్లోనూ నందిగం సురేష్ కనిపించలేదని, ఆయన పాత్ర ఉందనడానికి ఆధారాలు లేవని సురేష్ తరుపున న్యాయవాది వాదించడంతో షరతులతో కూడిన బెయిల్ లభించింది.
Next Story