Sat Jan 11 2025 00:08:55 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దిరెడ్డి దోపిడీ అంతా ఇంతా కాదు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం పాల, మామిడి రైతులను దోపిడీ చేసిందన్నారు. రాష్ట్రాన్ని జగన్ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశాడన్నారు. కేంద్రం ఇచ్చే పెన్షన్లను రాష్ట్రం ఇస్తున్నట్లుగా చెప్తున్నారన్నారు. రోడ్ల కోసం బీజేపీ నిధులిస్తే తామే రోడ్లు వేసినట్లు చెప్తున్నారన్నారు
సెక్రటేరియట్ ను కూడా తాకట్టు పెట్టి...
ముఖ్యమంత్రి కూర్చునే సెక్రటేరియేట్ ను కూడా చివరకు తాకట్టు పెట్టారన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లిలో భూకబ్జాలు అధికమయ్యాయన్నారు. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డిని అడుగుపెట్టనీయకుండా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదన్నారు అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములను కక్కిస్తామని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Next Story