Mon Dec 23 2024 04:09:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేటి నుంచి జగన్ అభ్యర్థులతో విడివిడిగా భేటీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేతలతో భేటీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఆయన తెలుసుకోనున్నారు. వరసగా నియోజకవర్గాల వారీగా నేటి నుంచి వైసీపీ నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ అవుతున్నారు.
ఓటమికి గల కారణాలను...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమికి పార్టీ అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానిపై నేతలను అడిగి తెలుసుకోనున్నారు. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా వారితో చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో జగన్ నేటి నుంచి వరసగా సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story