Sat Dec 28 2024 07:47:37 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పిన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక టీవీ ఛానల్ లైవ్ షోలో పాల్గొనడానికి వచ్చిన కేసీఆర్ ఏపీ రాజకీయాలపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు నడుస్తున్నాయని ఎవరు గెలుస్తారని మీ అంచనాలున్నాయని యాంకర్ అడిగిన ప్రశ్నకు గులాబీ బాస్ విస్పష్టంగానే సమాధానం చెప్పారు. తనకు జగన్ ఈ ఎన్నికల్లో గెలుస్తారన్న సమాచారం ఉందని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ పోటీ చేయదు...
ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మిత్రులేనని అయితే జగన్ గెలుస్తారని మాత్రం తనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుందన్నారు. ఏపీ రాజకీయాలతో తమకు సంబధం లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపీ ఎన్నికల్లో పోట ీచేయడం లేదని కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టామని, ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని తెలిపారు.
Next Story