Mon Dec 23 2024 03:49:26 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రేపటి పల్నాడు పర్యటనకు జగన్ ను అనుమతిస్తారా?
బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్పోర్ట్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు
బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్పోర్ట్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు. పల్నాడులో వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడని తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హుటాహుటిన విజయవాడకు బయలుదేరి వచ్చారు. బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన జగన్ కు గన్నవరం ఎయిర్పోర్ట్లో నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
వినుకొండకు...
రేపు ఉదయం జగన్ వినుకొండకు బయలుదేరి వెళ్లనున్నారు. చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జగన్ పర్యటనకు అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
Next Story