Mon Dec 23 2024 04:07:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వారం రోజులలో కార్యకర్తలను కలుస్తా.. ప్రకటించిన జగన్
త్వరలో కార్యకర్తలను కలసి వారిని అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు
త్వరలో కార్యకర్తలను కలసి వారిని అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైసీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని చోట్ల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు. అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారిని పార్టీ నుంచి వెళ్లకుండా నిలువరించేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు.
దాడులు జరిగిన..
పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, దాడులు జరిగిన కార్యకర్తలను తాను పరామర్శించి వారిని ఓదారుస్తానని, వారం రోజుల్లోనే రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని జగన్ నేతలతో అన్నారు. తాను ఇక జనంలోనే ఉండేలా ప్రయత్నిస్తానని అన్నారు. కిందిస్థాయి కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఎవరూ చూస్తూ ఊరుకోవద్దని, న్యాయపోరాటం చేసి క్యాడర్ ను రక్షించుకుందామని ఆయన సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవిస్తూనే తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిద్దామని జగన్ అన్నారు.
Next Story