Tue Dec 24 2024 12:31:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ కు వీడ్కోలు సభ
నేడు మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభ జరగనుంది.
నేడు మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభ జరగనుంది. విజయవాడలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. జగన్ తో పాటు మంత్రులు కూడా హాజరవుతారు. గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ అందించిన సేవలను ఈ సమావేశంలో కొనియాడనున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు...
విజయవాడలో నిర్వహించనున్న ఈ సమావేశం ప్రాంగణం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచే తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ కు వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వమే ఈ సభను ఏర్పాటు చేసింది.
Next Story