Mon Dec 23 2024 00:50:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏబీకి బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని యూపీఎస్సీ తోసిపుచ్చింది. అవసమనుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
ఇంక్రిమెంట్లు రద్దు...
అయితే ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశముందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను క్యాట్ లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేసే అవకాశముందని సమాచారం. అయితే డిజీపీ హోదాలో అత్యున్నత పే స్కేల్ కి చేరుకున్న ఏబీవీ కి కొత్తగా ఇంక్రిమెంట్లు ఎలాగూ ఉండవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Next Story