Mon Dec 23 2024 08:47:14 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్.. మరికాసేపట్లో కోర్టుకు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసారావుపేటలో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఎస్పీ కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లలోని కోర్టుకు తరలించే అవకాశముంది. ఈవీఎం ను ధ్వంసం చేయడం, అడ్డుకున్న వారిపై దాడి చేయడంతో పాటు మూడు హత్యా యత్నం కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదయ్యాయి.
ముందస్తు బెయిల్ ను...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టవేయడంతో పోలీసులు ఆయనను అదుపులోి తీసుకున్నారు. గతంలో ఇచ్చిన నాలుగు మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో పాటు ముందస్తు బెయిల్ పిటీషన్లను కూడా తిరస్కరించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story