Sun Dec 22 2024 19:07:28 GMT+0000 (Coordinated Universal Time)
High Court : నేడు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పై విచారణ
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ నేటితో ముగియనుంది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ నేటితో ముగియనుంది. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులోనూ, అనంతరం ఆయనపై నమోదయిన మూడు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర బెయిల్ ను ఈనెల 13వ తేదీ వరకూ హైకోర్టు మంజూరు చేసింది. అయితే దీనిపై ఇప్పటికే పిన్నెల్లి తరుపున న్యాయవాదులు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ న్యాయస్థానంలో వాదించారు.
బెయిల్ ను పొడిగిస్తారా?
అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ను పొడిగిస్తారా? లేదా? అన్నది నేడు తేలనుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ గడువు ముగియనుండటంతో ఆయన తప్పించుకుని వెళ్లకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద పహారా కాస్తున్నారు.
Next Story