Mon Apr 21 2025 18:40:33 GMT+0000 (Coordinated Universal Time)
Undavalli : ఆ రాయి తగలరాని చోట తగిలి ఉంటే?
మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై రాయి దాడి ఘటనపై స్పందించారు.

మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై రాయి దాడి ఘటనపై స్పందించారు. ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై రాయి పడిన మాట వాస్తవమేనని అన్నారు. రాయితో దాడి చేయడం తాను లైవ్ లో టీవీలో చూశానని అన్నారు. ఆ రాయి నుదుటిపై తగిలింది కానీ, కణితికి తగిలితే ప్రమాదం కాదా? అని ప్రశ్నించారు. జగన్ కావాలని దాడి చేయించుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నారని మీడియా ప్రతినిధులు అనగా, ఎవరైనా తలపై రాయితో కొట్టించుకుంటారా? అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రాయి దాడి ఘటన దురదృష్టకరమని అని అన్నారు.
మార్గదర్శిపై...
చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభల్లోనూ రాళ్లు విసిరారని, అయితే అవి వాళ్లకు తగలలేదని అన్నారు. దీంతోపాటు మార్గదర్శిపై కూడా ఆయన ఈ సమావేశంలో మాట్లాడారు. మార్గదర్శి కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. తాను మార్గదర్శి పై కేసు వేయబట్టే తనపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ తాను డిపాజిటర్ల ప్రయోజనాల కోసమే న్యాయస్థానంలో పోరాడుతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. 45 ఎస్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందో మార్గదర్శి యాజమాన్యం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దీనిపై తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.
Next Story