Wed Apr 23 2025 06:00:16 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ను బీజేపీ ఉపయోగించుకుంటుంది
జూనియర్ ఎన్టీార్ ను బీజేపీ రాజకీయాల్లో ఉపయోగించే అవకాశముందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు

జూనియర్ ఎన్టీార్ ను బీజేపీ రాజకీయాల్లో ఉపయోగించే అవకాశముందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. దేశ రాజకీయాల్లో ఆయనను ఉపయగించుకునే వీలుందని చెప్పారు. అమిత్ షా, జూనియర్ భేటీ రాజకీయమే అయి ఉండవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలపై అవగాహన ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
జగన్ ది మంచి నిర్ణయమే...
ఇక మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వడం శుభ పరిణామమని ఆయన అన్నారు. మార్గదర్శిపై ఈ రోజు స్పెషల్ లీవ్ పిటీషన్ విచారణకు వచ్చిందని, ఈ కేసులో రామోజీరావు తానేమీ చేయలేదని చెబుతున్నారని అన్నారను. ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వడం మంచిదని, జగన్ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు ముందు అందరూ సమానమేనని ఆయన చెప్పుకొచ్చారు.
Next Story