Tue Dec 24 2024 03:27:07 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : లోకేష్ చెప్పినట్లే పోలీసులు నడుచు కుంటున్నారు.. అంబటి ఫైర్
మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తున్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినందుకు అరెస్టు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఎన్నికలకు ముందు పోస్ట్ లు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారన్నారు. ఐదు నెలల తర్వాత అరెస్ట్ లు చేస్తున్నారని, బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు 41 నోటీస్ ఇచ్చి పంపించి వేయాలని, ఇతర కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు పెట్టిన వేధిస్తున్నారని, బయపెట్టాలన్న ఉద్దేశంతోనే అరెస్టు చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు.
వారి వత్తిడితోనే...
లోకేష్, పవన్ కళ్యాణ్ ఒత్తిడితోనే కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ముప్పై ఏళ్ళ కేసులు తోడతామని తెలిపారు. లోకేష్ చెప్పినట్లు చేసే స్థాయికి సీనియర్ ఐఎస్ఎస్ అధికారి, డిజిపి వచ్చారన్నారు. రాత్రంతా పి ఎస్ లో ఉంచారని, పవన్ కల్యాణ్ చెప్పినట్లు కొడతారేమో అని కార్యకర్తలు భయపడ్డారని, .అక్రమ కేసులు పెడితే భయపడతామనుకోవద్దంటూ అంబటి హెచ్చరించారు. సంస్కారవంతంగానే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడతామని, ప్రజలకు అవగాహన కల్గించే విధంగానే పోస్టులు ఉంటాయన్న అంబటి రాంబాబు, ధర్మంగా, న్యాయంగా పోస్ట్ లు పెట్టండని, తప్పుడు కేసులు పెడితే న్యాయ సాయం అందిస్తామని సోషల్ మీడియా వారియర్స్ కు తెలియజేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, పోలీసులు చట్టప్రకారం వ్యవహరించాలని తెలిపారు.
Next Story