Sun Dec 22 2024 20:06:53 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : చంద్రబాబు పోలవరం బురదను జగన్ పై చల్లుతున్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి వల్లనే పోలవరం వచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి వల్లనే పోలవరం వచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2009 వరకూ వైఎస్ అనేక క్లిష్టమైన అనుమతులన్నీ తీసుకు వచ్చిన ఘనత వైఎస్దేనని ఆయన అన్నారు. పర్యావరణం, అటవీ అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే వచ్చాయన్నారు. ఏడు గ్రామాలను కలిపినందుకే చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. వైఎస్ కలలు కన్న పోలవరం ప్రాజెక్టును జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ పై పోలవరం బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అహంతో మాట్లాడుతున్నారు...
ముగ్గురు కలిసినా వచ్చింది 56 శాతం ఓట్లు మాత్రమేనని, ఒక్క జగన్ కే 40 శాతం ఓట్లు వచ్చాయని అంబటి రాంబాబు గుర్తు చేశారు. చంద్రబాబు అహం పెరిగి మాట్లాడుతున్నారన్నారు. పదే పదే జగన్ దూషించడం వెనక భయం దాగుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్రద్ధ లేదని మరోసారి రుజువయిందని ఆయన తెలిపారు. చంద్రబాబు అసత్యాలు చెబుతుంటే చూసి బాధేస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు మాటలను చూస్తుంటే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకనే లేనిపోని ఆరోపణలను చేస్తున్నారని అంబటి రాంబాబు మండి పడ్డారు.
Next Story