Mon Dec 23 2024 11:28:25 GMT+0000 (Coordinated Universal Time)
Ambati : అన్న క్యాంటిన్లకు పసుపు రంగు ఎందుకు?
అన్న క్యాంటిన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే అందులో జరిగిన అవినీతిని తాము ప్రశ్నిస్తున్నామని అంబటి రాంబాబు తెలిపారు.
అన్న క్యాంటిన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే అందులో జరిగిన అవినీతిని తాము ప్రశ్నిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టి అన్న క్యాంటిన్లతో డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ ఛీట్ గా మార్చేశారన్నారు.
సూపర్ ఛీట్...
అన్న క్యాంటిన్లను రద్దీ ప్రదేశాల్లో పెట్టాలని, కానీ ఊరికి దూరంగా నిర్మించడమేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రెండు మూడు వందల మందికి భోజనాలు పెట్టి జనసంచారం లేనిచోట్ల వాటిని నిర్మించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ముతో అన్న క్యాంటిన్లను నిర్మించారని, వాటికి పసుపు రంగు ఎందుకు వేశారో చెప్పాలంటూ చంద్రబాబును అంబటి రాంబాబు నిలదీశారు.
Next Story