Mon Dec 23 2024 17:58:34 GMT+0000 (Coordinated Universal Time)
Anam : కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఆనం.. ఆ ఫిగర్ చేరుకుంటామని
నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు
నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఎవరూ తమకు సహకరించలేదన్న ఆనం వైసీపీకే కొమ్ము కాశారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్న చోట మహిళ కానిస్టేబుళ్లను నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
వైసీపీకే వత్తాసు పలికిన అధికారులు...
దీనిపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అయినా తాము మూడు వేల ఓట్లు రిగ్గింగ్ కాకుండా అడ్డుకోగలిగామని చెపపారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమని ఆనం జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కు పేదల సంక్షేమం పట్టదని, మాఫియా రాజ్యాన్ని నడిపారని ఆనం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమైనదని అన్నారు.
Next Story