Mon Dec 23 2024 16:11:41 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డికి 24 గంటలు గడువు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంెడ్డి శ్రీధర్ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంెడ్డి శ్రీధర్ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఆయన అన్నారు. ఇద్దరం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు ఇద్దామని, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నువ్వు నిరూపిస్తే తన రాజీనామాను ఆమోదించుకుంటానని, జరగలేదని చెబితే నువ్వు ఆమోదింపంచేసుకుంటావా? అని ఛాలెంజ్ విసిరారు. ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నానని అనిల్ అన్నారు.
ఎప్పుడైనా రాజీనామాకు...
ఎప్పుడైనా తాను రాజీనామాకు రెడీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జనవరి 27న కోటంరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ టీడీపీ ఖరారు చేసిందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పార్టీని వీడే సమయం వచ్చింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సరికాదని అనిల్ కుమార్ హితవు పలికారు. ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము అని, ఆయన ప్రాణాలకు ఎవరు హాని కలిగిస్తారని ఎద్దేవా చేశారు.
Next Story