Sat Dec 28 2024 23:49:21 GMT+0000 (Coordinated Universal Time)
నటించినా జనం నమ్మరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలతో పాటు చంద్రబాబు స్క్రిప్ట్ లకు కూడా పవన్ నటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎంత చేసినా ప్రజలు జనసేన, టీడీపీలను నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని నొక్కి చెప్పారు.
అందరూ కలిసి వచ్చినా...
జనసేనతో పాటు అందరినీ కలుపుకుని వచ్చినా 2024 ఎన్నికలలో విజయం తమదేనని అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తొలుత నువ్వు పోటీ చేసి గెలవాలని పవన్ కు ఆయన సవాల్ విసిరారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఒక కల అని, అభిమానులు కూడా అది తెలుసుకోవాలని హితవు పలికారు.
Next Story