Mon Dec 23 2024 19:34:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆనంపై అనిల్ ఫైర్.. జ్యోతిష్యం చెప్పించుకున్నాడేమో
రోజుకో పార్టీ మారే వాళ్ల గురించి తాను మాట్లాడనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు
రోజుకో పార్టీ మారే వాళ్ల గురించి తాను మాట్లాడనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆనం ఏమైనా జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారేమో అని అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు మామూలు సమయానికే వస్తాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఏడాది ముందు...
ఎన్నికలు ఏడాది ముందు వస్తాయని ఆయన కలలు కన్నాడేమో తనకు తెలియదని అన్నారు. తాము మాత్రం 2024 ఏప్రిల్ లోనే ఎన్నికలు జరగుతాయని తాము అనుకుంటున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఎక్కడ విన్నారో? తనకు తెలియదని అన్నారు. సీనియర్ నేతలు కొంచెం సంయమనంతో మాట్లాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story