Mon Dec 23 2024 10:45:03 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే నర్సీపట్నం రా.. ఇక్కడే ఉన్నా
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను నర్సీపట్నంలోనే ఉన్నానని, ముహూర్తం ఎందుకు? నువ్వు ఎప్పుడు వచ్చినా రెడీ అని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు. నువ్వు పోలీసులతో కాకుండా సింగిల్ గా వస్తే ఎవరు పులో? ఎవరు పిల్లి అనేది అప్పుడు తేలిపోతుందని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
పులిగా ఫీలయితే....
16 నెలలు జైలులో ఉండి చిప్పకూడు తినడం వల్ల శరీరం మందపడిందని విజయసాయిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు సెటైర్ వేశారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వల్ల ఏర్పడిన చారలు చేసుకుని పులిగా ఫీలవడంలో తప్పులేదని అయ్యన్న ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీకి వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలోకి వెళ్లావనం విడ్డూరంగా ఉందని అయ్యన్న ట్విట్టర్ లో మండిపడ్డారు. తాను నర్సీపట్నంలోనే ఉన్నానని, నీ సమాచార వ్యవస్థ ఎమైందని ప్రశ్నించారు. దమ్ముంటే నర్సీపట్నంకు రా అని అయ్యన సవాల్ విసిరారు.
Next Story