Mon Dec 23 2024 06:10:58 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనను చంపేస్తామని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనను చంపేస్తామని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్నందుకే తనను చంపేస్తున్నానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. పేదల భూములను వైసీపీ నేతలు విశాఖలో కబ్జా చేస్తున్నారని అన్నారు. జగన్ దేనికి సిద్ధమంటున్నాడని, దిగిపోవడానికా అంటూ ఆయన ప్రశ్నించారు.
లండన్ వెళ్లినా...
జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జగన్ లండన్ పారిపోయినా తీసుకు వచ్చి తిన్న సొమ్మును కక్కిస్తామని అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ పాలనలో ఎంత మంది ఎస్సీలు హత్యకు గురయ్యారో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కానీ జగన్ మాత్రం నా ఎస్సీలంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామని చెప్పారు. తన కుమారుడు టిక్కెట్ కోసం పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నారని అయ్యన్న తెలిపారు.
Next Story